Gaddam Prasad Kumar: తెలంగాణ స్పీకర్ పదవికి మరి కాంగ్రెస్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఎన్నికకి సహకరించాలని ప్రతిపక్ష బిఆర్ఎస్ నిర్ణయించింది. ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేశారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సైతం కాంగ్రెస్ అభ్యర్థికే మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
గడ్డం ప్రసాద్ నామినేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంతకాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్ ఎన్నికకు అధ్యక్షత వహించనున్నారు.ఎన్నికల రోజున, అక్బరుద్దీన్ ఒవైసీ వారి ప్రతిపాదకులతో పాటు సక్రమంగా నామినేట్ చేయబడిన సభ్యుల పేర్లను చదువుతారు. ఒకే ఒక్క నామినేషన్ ఉంటే, సభ్యుడు ఎన్నికైనట్లు ప్రకటించబడతారు. బహుళ నామినేషన్ల విషయంలో అసెంబ్లీ బ్యాలెట్ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటుంది.బీజేపీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికవుతున్నారు.