CM KCR Election Campaign: తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 15న హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభ జరగనుంది. అనంతరం ఈ నెల 16 నుంచి నవంబర్ 9 వరకు పర్యటించనున్నారు. 41 నియోజకవర్గాల్లో సుడిగాలిలా కేసీఆర్ పర్యటించనున్నారు. పర్యటన పూర్తయిన తర్వత చివరి రోజు నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న హుస్నాబాద్, 16న జనగాం, భోంగిర్, 17న సిరిసిల్ల, సిద్దిపేట, 18న జడ్చర్ల, మేడ్చల్, 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్, మునుగోడు ఓం 26, పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్‌లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, 30న జుక్కల్, బాన్సువాడ నారాయణకేడ్, 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, నవంబర్ 2న భైంసాట్, ఆర్మూర్, కొత్తగూడేం. మరియు నవంబర్ 5న ఖమ్మం, నవంబర్ 6న గద్వాల్, మక్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, నవంబర్ 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
గత నెలలో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే 50కి పైగా నియోజకవర్గాల్లో పర్యటించి వేలకోట్ల పధకాలకు శంకుస్దాపనలు, ప్రారంభోత్పవాలు చేసారు. మరోవైపు పార్టీలోని అభ్యర్థులపై అసంతృప్తి ఉన్న చోట్ల నేతల మధ్య సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి మధ్య ఐక్యత తీసుకురావడానికి ప్రయత్నించడంపై పార్టీ దృష్టి సారించింది.