Site icon Prime9

EFLU: ఇఫ్లూలో లైంగిక వేధింపుల వ్యవహారం.. విద్యార్థుల ఆందోళన

IFLU

IFLU

EFLU: హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఇటీవల వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటన వివాదం ఇంకా సద్దుమణగలేదు. లైంగిక వేధింపుల బాధితురాలికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు మరోసారి ఆందోళనకి దిగారు. ఇఫ్లూ విసికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీనితో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌ పోలీసులు ఇఫ్లూకి చేరుకున్నారు. ఇఫ్లూ గేట్ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇఫ్లూ కాంపౌండ్‌లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టారని వారి సహచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు ప్రధాన గేటు వద్ద నిరసన చేస్తున్న 20 మందికి పైగా విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) మరియు ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు, వారు క్యాంపస్ ప్రధాన గేటు వెలుపల నిరసనలో పాల్గొన్నారు. ఇఫ్లూ వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది మీడియాతో సహా ఎవరినీ క్యాంపస్‌లోకి అనుమతించలేదు.

వీసీ రాజీనామా చేయాలంటూ ..(EFLU)

అక్టోబర్ 18 రాత్రి క్యాంపస్‌లో లైంగిక వేధింపులకు గురైన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇష్లూ విద్యార్థి సంఘం సోమవారం మధ్యాహ్నం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించింది. VC మీ సమయం ముగిసింది” అనే ప్లకార్డులను పట్టుకుని వారు పిలుపునిచ్చారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా మరియు ప్రొక్టోరియల్ బోర్డు తొలగింపు కోసం వారు డిమాండ్ చేసారు. ధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రొక్టర్ టి శాంసన్ వచ్చి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి డిమాండ్లలో ఏ ఒక్కటీ ఆమోదించడం లేదని, విద్యార్థులు తమ నిరసనను విరమించుకోవాలని కోరారు. విద్యార్థులు కదలడానికి నిరాకరించడంతో పోలీసులు వారిని బలవంతంగా తరలించి అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version