Site icon Prime9

BJP-BRS Poster War: మోదీ పర్యటన వేళ.. బీజేపీ- బీఆర్ఎస్ పోస్టర్ వార్

BJP-BRS poster war

BJP-BRS poster war

BJP-BRS Poster War: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోస్టర్లు, ఫ్లెక్సీల యుద్ధానికి తెరలేచింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పోస్టర్లు, బ్యానర్లని ఏర్పాటు చేసింది. అలాగే మోదీ తెలంగాణని ప్రతిసారి కించపరుస్తున్నారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏయే సందర్భంలో మోదీ తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడారో తెలిసేలా ఫ్లెక్సీలపై రాశారు.

మోదీ చేసిన వ్యాఖ్యలనే..(BJP-BRS Poster War)

తెలంగాణ ఏర్పాటుపై వివిధ సందర్భాల్లో పార్లమెంట్‌లో మోదీ మాట్లాడుతున్నట్లు పోస్టర్లలో నాలుగు వేర్వేరు చిత్రాలు ఉన్నాయి.బిడ్డను రక్షించడానికి తల్లిని చంపారు అనే ప్రధాన మంత్రి వ్యాఖ్యను పోస్టర్ పై రాసారు ఇది 2018, 2022 మరియు 2023లో మోడీ చేసిన ప్రసంగాల నుండి తీసుకున్నారు.సెప్టెంబరు 18న ఆయన చేసిన తెలంగాణ సంతోషంగా లేదన్న వ్యాఖ్యలు కూడా పోస్టర్లపై ఉన్నాయి. ఐటిఐఆర్,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,టెక్ష్ట్స్ టైల్ పార్క్,డిఫెన్స్ కారిడార్ ,మిషన్ భగీరథ నిధులు,గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలలను గుర్తుకు తెచ్చేలా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో మోదీ బ్యానర్ ఏర్పాటు ఏర్పాటు చేసారు.మరోవైపు మోదీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లకి బిజెపి దీటుగా సమాధానం ఇచ్చింది. తెలంగాణలో ప్రతి ఐదేళ్ళకి ఓసారి ఎమ్మెల్యేలని కొనే అతిపెద్ద కొనుగోలుదారు అంటూ బిజెపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మెట్రో స్టేషన్ల వద్ద బిజెపి కార్యకర్తలు ఈ పోస్టర్లని అంటించారు.

గతంలో మార్చినెలలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య పోస్టర్ వార్ జరిగింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు తరచుగా కేంద్రం తెలంగాణపై వివక్షను చూపుతోందని ఎటువంటి సాయం అందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం కోట్లాదిరూపాయలు తెలంగాణకు కేటాయించిందని చెబుతున్నారు. ఇలా ఉండగా గత కొద్ద కాలంగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కూడా కలవడం లేదు. ఈ సారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు.

 

Exit mobile version