DSC Exam: డీఎస్సీ పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. డీఎస్సీ పరీక్షల హాల్ టిక్కెట్లు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యా శాఖ ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ నుండి తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలను వాయిదా వేయాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్‌లు వస్తున్నప్పటికీ.. షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
జూలై 18 నుంచి ఆగష్టు 5 వరకు..(DSC Exam)
విద్యా శాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షలు జూలై 18న ప్రారంభమై ఆగస్టు 5న ముగుస్తాయి. డీఎస్సీ 2024 రిక్రూట్‌మెంట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT)గా నిర్వహించబడతాయి. పరీక్ష మొత్తం 80 మార్కులకు ఉంటుంది, ఇందులో 160 ప్రశ్నలు ఉంటాయి మరియు రెండు గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ మరియు సబ్జెక్టు-నిర్దిష్ట అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. టీఎస్ టెట్ వెయిటేజీ ఆధారంగా అదనంగా 20 మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్ష స్కోర్‌లను టెట్ వెయిటేజీతో కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.
మొత్తం 11,062 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182, ఎస్జీటీ పోస్టులు 6,508, స్పెషల్ కేటగిరీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులు 796 ఉన్నాయి. ఈ సంవత్సరం డీఎస్సీ పరీక్షలకు మొత్తం 279,956 దరఖాస్తులు వచ్చాయి