Site icon Prime9

DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. ఈసీ ఉత్తర్వులు జారీ

DK Aruna

DK Aruna

DK Aruna: గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణని గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు డీకే అరుణని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

తప్పుడు అఫిడవిట్ తో ..(DK Aruna)

ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఆగష్టు 24న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. అందులోనుంచి యాభై వేల రూపాయలని డికె అరుణకివ్వాలని కోర్టు ఆదేశించింది.కృష్ణమోహన్ తన ఆస్తులకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్‌లో సమర్పించారని ఆరోపిస్తూ డీకే అరుణ తన మేనల్లుడుపై హైకోర్టును ఆశ్రయించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆస్తులు అమ్ముకున్నారని ఆరోపించారు. అంతేకాదు రాండమ్ చెకింగ్‌లో భాగంగా VVPAT ప్రింటెడ్ స్లిప్‌లను లెక్కించినప్పుడు, EVM ద్వారా భద్రపరచబడిన ఓట్లు మరియు VVPATల ముద్రించిన స్లిప్పుల పరంగా తేడాలు ఉన్నట్లు డీకే అరుణ ఎన్నికల ఏజెంట్ గమనించారు. వీటన్నింటిపై డీకే అరుణ పిటిషన్ దాఖలు చేసారు.

Exit mobile version