Site icon Prime9

Chandrababu: తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

diwali wishes from chandrababu

diwali wishes from chandrababu

Chandrababu: తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. వెలుగుల పండుగ దీపావళి శుభవేళ దివ్య దీపాల కాంతులు ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించే విజయమే దీపావళి అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ దీపావళి శుభదినాన ప్రతి ఒక్కరి ఇంట ఆనందాలు వెల్లువెత్తాలని సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: దేశప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని కోరిన సీఎం కేసీఆర్

Exit mobile version