Rice and Pulses on Concession in AP: : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. కందిపప్పు, బియ్యం విక్రయాలు కౌంటర్లు ప్రారంభం అయ్యాయి. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్ లో కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
ఏపీ వ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇవాళ ఒక పండుగ అన్నారు మంత్రి నాదేండ్ల మనోహర్. సంక్షేమ పథకాలతో పాటుగా నిత్యవసర సరుకులు సరైన ధరలకు అందించడానికి కృషి చేసామన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అక్రమాలపై పోరాటాలు చేసామని… రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. ధరల స్ధిరీకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్యంగా రీటైలర్స్ తో సమీక్షించామని… ఔట్ లెట్ల లో కందిపప్పు, బియ్యం అందిస్తున్నామన్నారు. రోజుకు 391 మెట్రిక్ టన్నులు బియ్యం, 125 క్వింటాళ్ళ కందిపప్పు అందుబాటులో ఉంచామన్నారు.
784 అవుట్ లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. రైతు బజారే కాదు… అన్ని పెద్ద మాల్స్ లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచామన్నారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, మిల్లెట్స్, పంచదార, రాగి పిండి, తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామన్నారు. బియ్యం కూడా బయటి మార్కెట్ కన్నా తక్కువకే ఇస్తున్నామని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు కు, వినియోగదారులకి మేలు జరగాలనేది తమ ఆకాంక్ష అన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రణ చేస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారని.. కాకినాడ లోనే 249 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ బియ్యం కుంభకోణం లో ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ పాత్ర ఉందని.. విచారణ పూర్తి అయ్యాక తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పీడీయస్ బియ్యం పేదలకే అందాలన్నారు.