Site icon Prime9

Kurnool Dstrict: కర్నూలు జిల్లాలో వజ్రాలవేట..

Kurnool district

Kurnool district

Kurnool Dstrict: రాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ఒక వెలుగు వెలిగింది . ఇప్పుడు రాయల సీమ నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారుతుంది . మట్టిలో మాణిక్యాలు వుంటాయని సామెత .రాయలసీమ మట్టిలో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయి . అదికూడా వర్షా కాలంలో మాత్రమే సాధారణంగా వర్షం పడితే మట్టి వాసన రావడం సహజం.. కానీ రాయలసీమలో మాత్రం నాలుగు చినుకులు పడితే చాలు మ‌ట్టి నుంచి వ‌జ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాకాలం మొద‌లు కావ‌డంతో వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా కర్నూలు ప్రాంత ప్రజలు పనులన్నింటిని వదులుకుని వజ్రాల వేటలో పడ్డారు.జిల్లాలోని మిగతా ప్రాంతాలనుంచే కాకుండా పక్క జిలాల్లనుంచి ,పక్క రాష్ట్రాలనుంచి కూడా జనాలు వజ్రాల కోసం వస్తున్నారు .

పేరులోనే వుంది ‘వజ్ర’ కరూర్..(Kurnool Dstrict)

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా జొన్నగిరిలో కొందరికి మూడు వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రం 6 లక్షల యాభై వేలు, మరో వజ్రం 2 లక్షల యాభై వేలకు విక్రయించగా.. ఇంకో వజ్రం లక్షా ఇరవై వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు..అదే విధంగా తాజాగా ఒక వ్యక్తికి 20 లక్షల రూపాయల విలువ చేసే వజ్రం దొరికింది .దింతో జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు చేరుకుని వేటను కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా క‌ర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంత‌పురం జిల్లా వ‌జ్రక‌రూరులో వ‌జ్రాల కోసం వేట కొనసాగిస్తుంటారు. ఈ ప్రాంతాలతో పాటు ఎమ్మిగనూరు, కోసిగిలోని పంటపొలాల్తొలో కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయి. దీనితో వర్షాలు కురుస్తుండటంతో వ‌జ్రపు రాళ్లు బ‌య‌ట‌ప‌డకపోతాయా..? తమ పంట పండకపోతుందా అంటూ వజ్రాల అన్వేషకులు ఈ ప్రాంతాల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు. ఆయా ఆప్రాంతాల్లో లాడ్జ్ లు కూడా ఫుల్ అవుతున్నాయి . చిన్న రాయి దొరికినా చాలు త‌మ జీవితాలు మారిపోతాయ‌నే ఆశ‌తో జ‌నం పెద్ద ఎత్తున సంబంధిత గ్రామాల్లో జ‌ల్లెడ ప‌డుతున్నారు. స్థానికంగానేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వజ్రాల వేట కోసం వస్తుండటంతో ఈ ప్రాంతాల్లో సందడి నెలకొంది.

Exit mobile version
Skip to toolbar