Bunny Festival: ఏపీలోని కర్నూల్ జిల్లా దేవర గట్టు పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది .కర్రల యుద్ధం. ప్రతి దసరా రోజు రాత్రి బన్నీ ఉత్సవం పేరుతో కర్రల తో కొట్టుకుంటారు .దీనికి ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చింది . పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో కర్నూలు జిల్లా ఆలూరు మండలం దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది.
చరిత్రకారుల హర్షం..(Bunny Festival)
2024-25విద్యాసంవత్సరానికి పదో తరగతికి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాల్లో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు, తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాన్ని ప్రస్తావించారు. ప్రతిఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర, కర్రల సమరం కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది.ఆ వేడుకకు సంబంధించిన చరిత్రను తాజాగా పదోతరగతి తెలుగు వాచకంలో పొందు పరిచారు. భక్తులు, కర్రలు ఎందుకు తీసుకువస్తారు…? పండుగ ప్రత్యేకత, గుడి వద్ద పూజారులు వినిపించే భవిష్యవాణి, వసంతోత్సవం రోజున దేవరగట్టులో గోరవయ్యలు ఇనుప గొలుసు తెంపడం వంటి అంశాలను పాఠ్యాంశంలో చేర్చారు. ప్రాచీన సం ప్రదాయ పండుగ దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ చరిత్ర, బన్నీ జైత్ర యాత్రపై తెలుగు కొత్త పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం ప్రచురించడం పై చరిత్రకారులు సంతోషం వ్యక్తం చేశారు.