Bribe for Chandrababu House: ఎవరైతే నాకేంటి? చంద్రబాబు ఇంటి స్దలానికి లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్

ఎవరైతే నాకేంటి..సీఎం అయినా...పీఎం అయినా ఐ డోంట్ కేర్..లంచం ఇస్తేనే పని అవుతుంది. పచ్చనోట్లు చేతిలో పడితేనే పని. లేకపోతే ఫైల్ పెండింగే..లంచం ఇవ్వండి..మీకు కావాల్సిన ఫైల్స్ పై సంతకాలు పెట్టించుకోండి. నేనింతే..ఎవరేమనకున్నా నా రూటే సెపరేట్ అంటున్నాడు ఓ అధికారి.

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 01:08 PM IST

Bribe for Chandrababu House: ఎవరైతే నాకేంటి..సీఎం అయినా…పీఎం అయినా ఐ డోంట్ కేర్..లంచం ఇస్తేనే పని అవుతుంది. పచ్చనోట్లు చేతిలో పడితేనే పని. లేకపోతే ఫైల్ పెండింగే..లంచం ఇవ్వండి..మీకు కావాల్సిన ఫైల్స్ పై సంతకాలు పెట్టించుకోండి. నేనింతే..ఎవరేమనకున్నా నా రూటే సెపరేట్ అంటున్నాడు ఓ అధికారి. ఈయనగారు చేసిన ఘన కార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘనుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబునే లంచం అడిగాడు.

వ్యవసాయేతర భూమిగా మార్చడానికి..(Bribe for Chandrababu House)

ఏపీ సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పంలో నివాసం ఉండేందుకు ఇంటి నిర్మాణం చేపట్టారు. అపుడు చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు. అధికారంలో లేరు. దీనితో చంద్రబాబు నివాస స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ క్లియరెన్స్ కోసం..డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లంచం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కొనుగోలు చేసిన నివాస స్థలం వ్యవసాయ భూమి కావడంతో..స్థానిక టీడీపీ నేతలు..భూమి మార్పిడికి అప్లై చేశారు. అయితే భూ మార్పిడికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ఏకంగా..1.80 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇటీవల కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియడంతో..విచారణకు ఆదేశించారు. సదరు అధికారి లంచం డిమాండ్ చేసిన విషయం నిజమని తేలడంతో..డిప్యూటీ సర్వేయర్ సద్ధాం హుస్సేన్ ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.