Prime9

రాజన్న సిరిసిల్ల జిల్లా : కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్…

Rajanna Sirisilla District : తండ్రి కళ్లెదుటే కుమార్తె కిడ్నాప్ అయిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో చోటు చేసుకుంది. తండ్రి చంద్రయ్యతో కలిసి షాలిని హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా కిడ్నాప్‌కు గురిైంది. దేవాలయం వెలుపల కారులో కాపు కాసిన నలుగురు యువకులు… యువతి బయటకు వచ్చిన వెంటనే తండ్రిని కొట్టి బలవంతంగా లాక్కెళ్లారు.

యువతిని బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేశాడు. యువతి కిడ్నాప్‌కు సంబంధించి ఫోక్సో కేసులో జైలుకి వెళ్లి వచ్చిన యువకుడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్నకేటీఆర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను పిలుచుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లాలో శాంతి భద్రతల పై ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టమని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని సూచించారు.

Exit mobile version
Skip to toolbar