Cyclone Michoung: మిచౌంగ్ తుఫాన్ తో పంటలకు అపార నష్టం

మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలకు అపార నష్టం జరిగింది... వర్షం కారణంగా మిరప పంట నీట మునిగింది. మరో వారం రోజులలో మొదటి కోతకు రైతు సిద్ధపడిన సమయంలో మిచౌంగ్ తుఫాను రైతుకు కన్నీరు మిగిల్చింది.పంట సాగుకోసం చేసిన అప్పులు మాత్రం మిగిలాయని, పంట మాత్రం చేతికి రాలేదని రైతులు అంటున్నారు.చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతన్న ఆవేదనకు అంతు లేకుండా పోయింది.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 04:28 PM IST

Cyclone Michoung: మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంటలకు అపార నష్టం జరిగింది… వర్షం కారణంగా మిరప పంట నీట మునిగింది. మరో వారం రోజులలో మొదటి కోతకు రైతు సిద్ధపడిన సమయంలో మిచౌంగ్ తుఫాను రైతుకు కన్నీరు మిగిల్చింది.పంట సాగుకోసం చేసిన అప్పులు మాత్రం మిగిలాయని, పంట మాత్రం చేతికి రాలేదని రైతులు అంటున్నారు.చేతికి వచ్చిన పంట నేల పాలు కావడంతో రైతన్న ఆవేదనకు అంతు లేకుండా పోయింది.

ప్రభుత్వం ఆదుకోవాలి..(Cyclone Michoung)

ఈ సంవత్సరం పల్నాడులో వర్ష పాతం సరిగ్గా లేక, సాగర్ జలాలు రాకపోవడంతో వరి పంట వేయాల్సిన రైతులు, మిర్చి, శనగ, మినుము, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువ సాగు చేశారు. తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనగ, కంది, మొక్కజొన్న, మినుము, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనగ, మినుము వేసిన పొలాల్లో నీరు నిలవడంతో పూర్తి స్థాయిలో పంట దెబ్బతింది. నిన్నటి దాకా వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు ఒక్కసారిగా అధిక వర్షపాతం నమోదవ్వడంతో తీవ్రనష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలు గ్రామ రైతులు మించాగ్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరటి తోటలు విరిగిపోయి నేలకొరిగాయి. మొక్కజొన్న పంట నీట మునిగి చెరువును తలపిస్తుంది. తడిసిన వరిచేలు, ధాన్యంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు కంటతడి పెడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పొలాలు కౌలుకు తీసుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిచౌంగ్ తుఫాన్‌తో తమ భవిష్యత్తు అయోమయంలో పడిందని సన్నకారు రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూస్తున్నామని త్వరగా కౌలు రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.గుంటూరు జిల్లా వ్యాప్తంగా30 వేల హెక్టార్లలో వరిపంట వర్షార్పణం అయింది. ప్రభుత్వం ఆదుకోకుంటే తమ పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్పారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఏరియా మెట్ట ప్రాంతం అయినా తుఫాన్ ప్రభావంనుంచి తప్పించుకోలేకపోయింది. మెట్ట ప్రాంతంలోని రైతన్నలను కూడా కన్నీరు పెట్టించింది. వరి, మొక్కజొన్న పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. ప్రగడవరం గ్రామంలో రైతులు కల్లాల్లో నీట మునిగిన ధాన్యపు రాశులను జెసిబి, ట్రాక్టర్ల సహాయంతో తరలించారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మర్సుమల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, మిర్చి, బంతి, మొక్కజొన్న పొలాలను ఆయన పరిశీలించారు. తుఫాను బాధితులకు మంచినీళ్లు, ఆహారం కూడా అందించని దౌర్భాగ్య ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ఇంటినుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు.

CROP