Site icon Prime9

Cannabis Cultivation: పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు

Cannabis Cultivation

Cannabis Cultivation

Cannabis Cultivation: కర్నూలు జిల్లా ఆదోని పరిసర గ్రామాల్లో కొందరు గంజాయి సాగు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా.. ఆదోని మండలం సంతేకుడ్లురులో రవి, చంద్ర అనే ఇద్దరు ఆదోని మండలం చిన్నగోనేహళ్లో గంజాయి సాగు చేస్తున్నట్లు బయపడింది. వీరు కొన్ని నెలలుగా పత్తి పంట సాగులో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. సాగు చేసిన పంటను కర్ణాటక, ఆంధ్రా తదితర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు.

కిలో 10వేల నుంచి రూ.50వేల దాకా.. (Cannabis Cultivation)

ఇటీవల బళ్లారిలో మహ్మద్ ముజా కరీన్, రిజ్వాన్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారు. వారిని స్టేషన్ కు తరలించి విచారించగా.. ఆదోని సమీపంలోని సంతేకుడ్లురు వాసులు తనకు అమ్మినట్లు చెప్పారు. దీంతో కర్ణాటక పోలీసులు సంతేకుడ్లూరు గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులో తీసుకునన్నారు. వారి వద్ద 50కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడ్డ గంజాయి విలువ 25 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్లో డిమాండ్ బట్టి కిలో 10వేల నుంచి రూ.50వేల దాక అమ్ముతున్నట్లు పెడ్లర్ల సమాచారం. ఆదోని ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version