Site icon Prime9

CM Jagan’s Foreign Travel: సీఎం జగన్ విదేశీ ప్రయాణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్

CM Jagan tour

CM Jagan tour

CM Jagan’s Foreign Travel: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో ఎట్టికేలకు ఊరట లభించింది. సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు.

ఈ నెల 17 నుంచి..(CM Jagan’s Foreign Travel)

సీబీఐ కోర్టు అనుమతితో ఈ నెల 17న జగన్ లండన్ వెళ్లనున్నారు. లండన్‌ తో పాటు యూరప్ లోని ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.దింతో కోర్ట్ పర్మిషన్ ఇస్తుందా లేదా అని ఉత్కంఠ కు తెరపడింది .

Exit mobile version