Site icon Prime9

TPCC Chief Revanth Reddy: కల్వకుంట్ల కుటుంబానికి కౌంట్‌డౌన్ మొదలైంది..టీపీసీసీ అధ్యకుడు రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

TPCC Chief Revanth Reddy: టీపీసీసీ అధ్యకుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఇక కల్వకుంట్ల కుటుంబానికి కౌంట్‌డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ 52 రోజుల కౌంట్ డౌన్..నాలుగు కోట్ల ప్రజలు మీ నియంత సర్కారుకు రాస్తున్న మరణశాసనం అని రేవంత్ రెడ్డి అన్నారు.

దగాపడిన యువత..(TPCC Chief Revanth Reddy)

కల్వకుంట్ల స్కామిలీకి కౌంట్ డౌన్.. ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్.ఇది.. మోసపోయిన దళితుడు, రక్షణ లేని ఆడకూతురు చెప్తున్న కౌంట్ డౌన్.ఇది.. అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్.ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్ ఇది అని నిప్పులు చెరిగారు.

ఇలాఉండగా కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఆరు గ్యారెంటీల మీదే తొలి సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎత్తులను చిత్తు చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. ప్రజల్లో సంతోషం మొదలయిందని.. ప్రజలకు కేసీఆర్ విముక్త తెలంగాణను తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను విన్న తర్వాత కేసీఆర్ కనిపించకుండా పోయారని.. కాంగ్రెస్ హామీలను చూసి చలి జ్వరం పట్టుకుందని అన్నారు. ప్రజా తీర్పు ఇప్పటికే డిసైడ్ అయిపోయిందని.. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన పని లేదని.. ఇక రెస్ట్ తీసుకోవచ్చని ఎద్దేవా చేశారు. డిశంబర్ నెలలో తెలంగాణలో ఒక అద్భుతం జరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version