Site icon Prime9

Cordon and Search: ఏపీలో కొనసాగుతున్న కార్డన్‌ అండ్‌ సెర్చ్‌

Cordon and search

Cordon and search

Cordon and Search: శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. జిల్లాల వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన సర్కిళ్లు, గ్రామాలు, నగర శివార్లలో సెర్చ్ ఆపరేషన్ చెప్పారు. ఈ డ్రిల్‌లో నిందితులు, పాత నేరస్తులు, పాత నేరస్తుల ఇళ్లు, అక్రమ మద్యం నిల్వ చేసే రహస్య స్థలాలు, హానికరమైన ఆయుధాలు, టపాసులు, డ్రగ్స్, వస్తువులు, రికార్డులు లేని వాహనాలు తదితర వాటి గురించి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

803 వాహనాలు సీజ్..(Cordon and Search)

168 సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి రికార్డులు లేని 803 వాహనాలను సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. వాస్తవంగా అల్లర్లలో చోటుచేసుకుని ఘటనలను అనుకరిస్తూ పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున, ఆ తర్వాత ఏవైనా అవాంతరాలు ఎదురైతో సమర్థవంతంగా అడ్డుకునేందుకు అధికారులను సిద్ధం చేయడమే లక్ష్యంగా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కసరత్తులు, వాస్తవ సంఘర్షణలను పోలి ఉండేలా వాస్తవికంగా నిర్వహించారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కౌంటింగ్ కు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం, డ్రైవర్స్ కాలనిలో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు . రికార్డులు సరిగా లేని 9 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు

Exit mobile version