Constable Agitation: మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన చేపట్టారు. సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్న మేడిపల్లి ఎస్సై శివకుమార్ తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్సై శివకుమార్ పై కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆందోళన చేశారు.
ఎస్‌ఐ కక్ష సాధింపు చర్యలు..(Constable Agitation)
తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికెట్ సృష్టించి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిపల్లి ఎస్‌ఐ శివకుమార్ పై గతంలో డీసీపీ, సీపీకి ఫిర్యాదు చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడని నాగమణి ఆందోళనకు దిగారు.తన పిటిషన్‌ను పరిశీలించకుండా తమపైనే తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని నాగమణి ఆరోపించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని నాగమణి అవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాల పై తన వద్ద ఆధారాలు ఉన్నాయని కానిస్టేబుల్ నాగమణి చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని నాగమణి డిమాండ్ చేశారు.