Pinda pradhanam:ట్రంకు లైన్ పేరుతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఫ్లెక్సీ ఫొటోలపై పిండ ప్రధానం అని రాసి డ్రైనేజీ నీళ్లలో వదిలేశారు.
మంత్రి అనుచరులకు కోట్లాది రూపాయలు..(Pinda pradhanam)
మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మంత్రాల చెరువులో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయని మండిపడ్డారు. గతంలోనే 23 కోట్లతో ట్రంకు లైన్ ఏర్పాటు చేసిన చెరువులో ఇలా జరగడం ఏంటని కొత్త మనోహర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ట్రంక్ లైన్ కాంట్రాక్టర్ పేరుతో మంత్రి తన అనుచరులకు కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కష్టపడి పన్నుల రూపంలో కట్టిన ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన మండిపడ్డారు.