Site icon Prime9

Cabinet Expansion: ఎట్టకేలకు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. మరో నలుగురికి చోటు!

Congress High Command Focus On Telangana Cabinet Expansion: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్ కుమార్ తదితరులు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో భాగంగా నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం.

 

అయితే ఎవరెవరికి పదవుల ఇవ్వాలో జాబితాతో రేవంత్ తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశా లు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ బాధ్యురా లు మీనాక్షి నటరాజన్ ఉన్నారు.ఇక, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తుంది. రాష్ట్రంలో మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డిప్యూటీ స్పీకర్ సహా పలు కేబినెట్ ర్యాంక్ హోదా గల కార్పొరేష న్ చైర్మన్ పదవుల కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని, వాటిలో తమకు అవకాశాలు కల్పించాలని కొంతమంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఆరు మంత్రి పదవుల కోసం కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, దిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్యే వివేక్‌తోపాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం వీరంతా రాత్రి పార్టీ అగ్రనేతరాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు సైతం కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశముందని తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar