CM KCR Comments: ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు బాగా ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం, కొత్తగూడెం లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఖమ్మంలో ఇరుకు సందులు, ట్రాఫిక్ కష్టాలు ఉండేవన్నారు. ఇప్పుడు ఖమ్మంలో సీసీరోడ్లు, ధగధగలాడే లైట్లు వచ్చాయని ఇవన్నీ మంత్రి పువ్వాడ చేస్తే వచ్చాయి.పువ్వాడ వాడవాడలా తిరిగి పనిచేసారని కేసీఆర్ తెలిపారు. పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారని తుమ్మ ముల్లు కావాలా.. పువ్వాడ పూలు కావాలా అంటూ అంటూ ప్రశ్నించారు. దేశంలో రాజకీయ పరిణితి రావాలన్న కేసీఆర్ ప్రజలు అన్నీ ఆలోచించి ఓటు వేయాలన్నారు.ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలేనని ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటిదన్నారు.
సింగరేణిని కాంగ్రెస్ నాశనం చేసింది..(CM KCR Comments)
సింగరేణి తెలంగాణ ఆస్తి అన్న సీఎం కేసీఆర్ సమైక్యపాలనలో కేంద్రం నుంచి అప్పులు తెచ్చి సింగరేణిని కాంగ్రెస్ నాశనం చేసిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రానికి 49 శాతం వాటా కట్టబెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సింగరేణి లాభాలను పెంచామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎలాంటి మార్పులు వచ్చాయో ప్రజలు గమనించాలి.బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని ప్రజలకో్సం పనిచేసే పార్టీని గెలిపించాలని కోరారు. కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందని, ఈ ప్రాంతంలో 13 వేల 500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చామని కేసీఆర్ తెలిపారు. వనమా వెంకటేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్జప్తి చేసారు.