Site icon Prime9

CM KCR: సన్నబియ్యం, ఫించన్లు, రైతు బంధు పెంపు.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్

CM KCR

CM KCR

CM KCR:  సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజలపై ఎన్నికల వరాలు కురిపించారు. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పేరుతో కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తామన్నారు.  దీనితో 93 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతుందన్నారు. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తామన్నారు. పెన్షన్‌ను దశలవారీగా 5 వేల రూపాయలకు పెంచుతామన్నారు. మైనార్టీల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. దశలవారీగా వికలాంగుల పింఛన్‌ను 6వేలు.. రైతుబంధును 16 వేలు చేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు 3వేల భృతి ఇస్తామన్నారు. అర్హులైన వారికి, అక్రిడేషన్ జర్నలిస్టులకు 400కే సిలిండర్ అందిస్తామన్నారు.

51 మందికి బీ ఫారాలు.. (CM KCR)

ఈ సందర్బంగా 51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేసారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. దీనితో ప్రభుత్వ విప్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్డన్ రెడ్డి కేసీఆర్ తరపున బీ ఫామ్ అందుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి ఇటీవల మరణించారు. దీనిత ఆయన తరపున భీ ఫామ్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్‌దే విజయం అని అన్నారు. టిక్కెట్లు రాని అభ్యర్దులు ఎవరూ తొందరపడవద్దని భవిష్యత్‌లో గొప్పగొప్ప అవకాశాలొస్తాయని అన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగిందన్నారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు చేస్తున్నామని అన్నారు. ప్రతీ కార్యకర్తతో నేతలు మాట్లాడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాలించాలని ఓపిక పట్టకపోతే నష్టపోతామని చెప్పారు.అభ్యర్థులందరూ సహనంతో ప్రచారం చేయాలని సూచించారు. బీఆర్ఎస్‌పై విపక్షాలు కుట్రలు చేస్తాయని ఇందుకు శ్రీనివాస్‌గౌడ్ అంశమే ఉదాహరణగా పేర్కొన్నారు. బీ ఫారాలు జాగ్రత్తగా నింపాలని అఫిడవిట్ల విషయంతో శ్రద్ద తీసుకోవాలని తెలిపారు.

Exit mobile version