Site icon Prime9

CM KCR: రాజశ్యామ‌లా యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంప‌తులు

CM KCR

CM KCR

CM KCR: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని ప్రారంభించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ఫామ్‌హౌస్‌లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగానికి అంకురార్పణ జరిగింది.

మూడురోజులపాటు యాగం..(CM KCR)

ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌‌లో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేసారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్,ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ మంత్రి వేణుగోపాలచారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

 

ఎర్రవల్లి  ఫామ్ హౌజ్ లో సీఎం కేసీఆర్  యాగం ప్రారంభం |  CM KCR Rajashyamala yagam | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar