Site icon Prime9

CM Jagan: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan

CM Jagan

 CM Jagan: ఏపీలో క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వద్ద పచ్చ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. జాతీయ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి) సహకారంతో స్వచ్ఛత ఉద్యమి యోజన (ఎస్‌యువై) కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎంపిక చేసిన 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు (సఫాయి కర్మచారిలు) ముఖ్యమంత్రి లాంఛనంగా వాహనాలను అందజేశారు. మున్సిపల్ వర్కర్స్‌కు వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయని సీఎం జగన్ తెలిపారు.

పారిశ్రామిక యూనిట్లకు శంకుస్దాపన..( CM Jagan)

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.1100 కోట్లవిలువైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పారిశ్రామిక యూనిట్లకు సీఎం జగన్ శంకుస్దాపన చేసారు. వీటిద్వారా 21,744 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)లో సంతకాలు చేసిన ఎంఒయులు వాస్తవరూపం దాల్చుతున్నాయని చెప్పారు.జిల్లా కలెక్టర్లు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలని, అడుగడుగునా అవసరమైన సహకారం అందించాలని ఆయన అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండ‌లంలోని దొరువుల పాలెంలో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ప్ర‌యివేట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన 4.2 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్న‌ల కెపాసిటీ ఎడిబుల్ ఆయిల్ రిఫైన‌రీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీనిద్వారా 1150 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం పెద్దిరెడ్లపాలెంలో APFPS ద్వారా ఏర్పాటు చేసిన 2.5 కోట్లతో నెలకొల్పిన నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఇది ఎల్. కోట జై కిసాన్ రైతుల ఉత్పత్తిదారుల సంస్థచే నిర్వహించబడుతుంది. 20 మంది వ్యక్తులకు ఉపాధి కల్పిస్తుంది.పరిశ్రమల శాఖ ద్వారా 18 జిల్లాల్లో రూ. 286 కోట్లతో నిర్మించే కాంప్లెక్స్‌లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

Exit mobile version