CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభింబచారు. అనంతరం మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వి. సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏపీలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు కాగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటితో ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా ఈ నాలుగేళ్లలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 966 నుంచి 1,767 కు పెరిగాయి. 2024-25 లో పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లిలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతాయి. 2025-26 లో పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ ప్రాంతాల్లో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభవుతాయి. ఇవి కాకుండా సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయగూడెం, దోర్నాలలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి.