CM Jagan Comments:ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పెన్షన్ల ను ఆయన పంపిణీ చేశారు. అనంతరం రంగరాయ వైద్య కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. పెన్షన్ల కోసమే నెలకు సుమారు 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచామని తెలిపారు ప్రతి నెల సుమారు 66 లక్షల 34 వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి కేవలం ఓట్ల కోసం రెండు నెలల ముందే పెన్షన్లను పెంచారని అన్నారు. మన ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం.. లంచాలకు తావు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు.కుల, మత, రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకంగా పింఛను పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. టీడీపీ పాలనలో వీటికోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని అన్నారు.
అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్‌ఆర్ ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, ఈబీసీ నేస్తం, జగనన్నతోడు, జగనన్న చేదోడు వంటి పథకాలు లేని టీడీపీ పాలనకు, ఇప్పటికీ తేడా చూడాలని జగన్ ప్రజలను కోరారు. రూ. గత 55 నెలల్లో డిబిటి సంక్షేమ పథకాలపై 2,46,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు.టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు తన పెంపుడు కొడుకు, దొంగల ముఠా మద్దతుతో దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరించారని జగన్ విమర్శించారు.ప్రజల పట్ల ప్రేమాభిమానాలు, సమస్యల పరిష్కారానికి నిబద్ధత కలిగిన పేదల ప్రభుత్వమిదని అన్నారు. ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని, 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, టీడీపీ హయాంలో ఒక్క ఇంటి స్థలం కూడా పంపిణీ చేయలేదన్నారు.