CLP Meeting: హైదరాబాద్ హెటల్ ఎల్లాలో సీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసారు. రేవంత్ రెడ్డి దీనిపై తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిని బలపరిచారు. సీఎల్పీ సమావేశం అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు తెలిపారు. సీఎం రేసులో రేవంత్ రెడ్డి పేరు జోరుగా వినిపిస్తుండగా డిప్యూటీగా మల్లు భట్టి విక్రమార్కకు దక్కే అవకాశం ఉంది.
హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ ..( CLP Meeting)
హైదరాబాదులో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి పేదలను ఆదుకుంటామన్నారు. మేనిఫెస్టోను తూచా తప్పకుండా ఫాలో అవుతామని అన్నారు.
మరోవైపు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరగుతున్నాయి. దీనికి సంబంధించి రాజ్ భవన్ వద్ద అధికారులు ఏర్పట్లు చేస్తున్నారు. ఇప్పటికే టెంట్లు, ఫర్నీచర్ ను రాజ్ భవన్ కు తరలించారు. మరోవైపు చుట్టు పక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నూతన ముఖ్యమంత్రి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.