Site icon Prime9

Medak Church: మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు

Medak Church

Medak Church

Medak Church: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరు పొందిన మెదక్ కేథడ్రల్ చర్చిలో మొదటి ఆరాధనతో వేడుకలను బిషప్ కె. పద్మారావ్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

మెదక్ చర్చి విద్యుత్తు దీపాలతో విరాజిల్లుతూ అందరిని ఆకట్టుకుంటుంది. పాస్టర్లు ఏసు శిలువ ముందు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కలర్​ఫుల్​​ లైటింగ్​లో చర్చి జిగేల్ మంటోంది. ఈసారి వేడుకలకు లక్షమందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్​బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ చర్చి నిర్మించి 99 ఏండ్లు పూర్తయి, 100 వ వసంతంలోకి అడుగుపెడ్తుండడంతో స్పెషల్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.

రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రం..(Medak Church)

ఆసియాలోనే మెదక్ చర్చి రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వర్థిల్లుతోంది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తైనా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగు రంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు వేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లండ్‌లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యే ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది.

Exit mobile version