Harirama Jogaiah: కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు.బుధవారం జనసేన పార్టీ 50 నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనేది ఆయన తన లేఖ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను హరిరామ జోగయ్య విడుదల చేశారు.
జనసేనకు కొవ్వూరు, పోలవరం..(Harirama Jogaiah)
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిన్నటి లేఖలో 9 స్థానాల గురించి ప్రస్తావించగా తాజాగా కొవ్వూరు, పోలవరం స్థానాలు కూడా జనసేనకు ఇస్తే బాగుంటుందని హరి రామ జోగయ్య తెలిపారు.అమలాపురం నుంచి శెట్టి బత్తుల రాంబాబు, రామచంద్రాపురం నుంచి పోలిశె్టి చంద్రశేఖర్, కొవ్వూరు నుంచి టివి రామారావు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, విజయవాడ పడమర నుంచి పోతిన మహేష్, కావలి నుంచి అలహరి సుధాకర్, రాజంపేట నుంచి ఎం.వి. రావు, రాజోలు నుంచి బొంతు రాజేశ్వర రావు, పుట్టపర్తి నుంచి పి. శివశంకర్ లేదా పత్తి చంద్రశేఖర్, ధర్మవరం నుంచి మధుసూధన్ రెడ్డిలు జనసేన నుంచి పోటీ చేస్తే బాగుంటుందని జోగయ్య పేర్కొన్నారు.