Site icon Prime9

Chandrababu: జైల్లో నాకు ప్రాణహాని ఉంది.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

Chandrababu:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ ఎసిబి కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీన మూడు పేజీల లేఖని జైలు అధికారుల ద్వారా ఎసిబి కోర్టు న్యాయమూర్తికి పంపించారు. తాను జైలులోకి ప్రవేశించేటప్పుడు ఓ రిమాండ్ ఖైదీ అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీశాడని చంద్రబాబు లేఖలో ఆరోపించారు.

నా హత్యకు కుట్ర..(Chandrababu)

నిబంధనలకు విరుద్ధంగా జైల్లోకి వచ్చిన సమయంలో నా వీడియో ఫుటేజ్ లు బయటికి విడుదల చేశారు.పోలీసులే నా ఫోటోలు,వీడియోలు స్వయంగా బయటికి విడుదల చేశారు. సోషల్ మీడియా,ప్రధాన ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా ఆ వీడియోలు ప్రచారమవుతున్నాయి. నా ప్రతిష్టకు భంగం కలిగించాలని దురుద్ధేశపూర్వకంగానే వీడియోలు,ఫోటోలు విడుదల చేశారు.నన్ను హత్య చేసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. రిమాండ్ ఖైదీగా ఉన్న నన్ను జైలు లోపల ఉన్న సమయంలో పెన్ కెమెరాతో ఒక వ్యక్తి వీడియోలు తీశాడు.ఆ వ్యక్తి ఎస్.కోటకు చెందిన ఖైదీగా తెలిసింది. ఆ వ్యక్తి గంజాయి తరలింపు కేసులో అరెస్ట్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు.

తనని చంపేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నారని, ఈ విషయంపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఓ లేఖ కూడా వచ్చిందని చంద్రబాబు న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో పోలీసులు ఇంత వరకూ చర్యలు కూడా తీసుకోలేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 2019నుంచి తన భద్రతని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, పర్యటనలకి వెళ్ళినప్పుడు తనపై రాళ్ళ దాడులు కూడా జరిగాయని చంద్రబాబు లేఖలో వివరించారు.రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాకు నా భద్రత పై అనుమానాలున్నాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండే నాకు ఇక్కడి భద్రత పై అనుమానాలున్నాయి.నాకు ఇక్కడ లైఫ్ థ్రెట్ ఉందంటూ చంద్రబాబు తన లేఖలో పాల్గొన్నారు.

Exit mobile version
Skip to toolbar