Site icon Prime9

Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్.. ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు..

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ హాజరుపర్చింది.. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.  రిమాండ్ రిపోర్ట్‎ను తిరస్కరించాలని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా నోటీసులిచ్చారు. ఈ కేసులో తన వాదనలు వినాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. 409 సెక్షన్ కింద వాదనలు కొనసాగుతున్నాయి. 409 సెక్షన్ పెట్టడం కరెక్ట్ కాదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా అన్నారు.

నేను ఏ తప్పు చేయలేదు.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu Arrest)

రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా న్యాయమూర్తిని కోరడంతో.. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి అనుమతించారు. ఇక 409 సెక్షన్ పెట్టడం సరికాదని సిద్ధార్థ్ లూథ్రా వాధించారు. 409 పెట్టాలంటే సరైన సాక్ష్యం చూపించాలని.. ఆధారాలు లేవు కాబట్టి రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. ఇక సీఐడీ మాత్రం లూథ్రా వాదనలకు కౌంటర్ ఇస్తోంది. ఇక చంద్రబాబు తన వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారన్నారు. రాజకీయ కక్ష్య సాధింపలో భాగంగానే ఇధంతా జరుగుతోందన్నారు. ఈ స్కామ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ అరెస్ట్ అక్రమమైనదని చంద్రబాబు అన్నారు. తాను ఏ తప్పు చేయలేదన్నారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబుపై అనేక అభియోగాలు మోపారు. ప్రభుత్వ నిధులు రూ.371 కోట్ల మేర అవినీతి జరిగిందని, షెల్‌ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల స్కాం చేశారని ఆరోపించారు. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి ప్రభుత్వ సొమ్ము కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఈడీ, సెబీ..ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తు చేశాయి. దోచేసిన సొమ్మును ముందుగా విదేశాలకు అక్కడి నుంచి తిరిగి దేశంలోకి మళ్లించినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు సూత్రధారి అని సీఐడీ ఆరోపిస్తుంది. ఫేక్ డాక్యుమెంట్లతో మోసానికి పాల్పడ్డారని అన్నారు. ఈ మేరకు 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది సీఐడీ. దీనిల్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరిగిన తీరును వివరించింది. ఇదిలా ఉండగా రిమాండ్ రిపోర్టులో సీఐడీ లోకేష్ పేరు కూడా చేర్చడం గమనార్హం.

కోర్టులో పోటాపోటీగా వాద‌న‌లు.. తుదితీర్పు పై ఉత్కంఠ‌|Chandrababu Naidu Arrest Remand Report | Prime9

Exit mobile version
Skip to toolbar