Chandrababu Tour in North Andhra: భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర వలసలు తగ్గుతాయి.. సీఎం చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకరోజు పర్యటనను ప్రారంభించారు. ముందుగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో .. పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించారు

  • Written By:
  • Publish Date - July 11, 2024 / 08:10 PM IST

Chandrababu Tour in North Andhra: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకరోజు పర్యటనను ప్రారంభించారు. ముందుగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో .. పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ పునర్నిర్మాణం కోసం ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకాలు పెద్ద సమస్యగా మారాయని.. రాష్ట్ర పునర్‌ నిర్మాణ మిషన్‌లో అందరి సహకారం అవసరమన్నారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరమని.. పోలవరం పూర్తయితే కరువు సమస్య ఉండదని చంద్రబాబు అన్నారు.

38 శాతం పనులు పూర్తి..(Chandrababu Tour in North Andhra)

అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ప్రతినిధులు సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. పారిశ్రామికంగా ఎదగడానికి భోగాపురానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. నిర్మాణ సంస్థ కూడా ఉత్తరాంధ్రా వాసిదే నని.. విమానాశ్రయ పనులను పరిగెత్తించాలని తెలిపారు. ఇప్పటికే 38 శాతం భోగాపురం విమానాశ్రయ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.48 లక్షల మంది ప్రయాణీకులకు వసతి కల్పించే ప్రారంభ సామర్థ్యంతో, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర ఆంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరాన్ని తగ్గించవచ్చని అన్నారు. 2026 జూన్ నాటికి విమానాశ్రయం మొదటి దశను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.