Site icon Prime9

ఏపీ: కాపుల రిజర్వేషన్లు చట్టబద్దమే.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

kapu

kapu

Kapu Reservation In Ap: కాపుల రిజర్వేషన్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. 2019లో కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం.. చట్టబద్దమేననని కేంద్రం పేర్కోంది. టీడీపీ హయాంలో కాపులకు కల్పించిన 5శాతం రిజర్వేషన్లు చెల్లుతాయని తెలిపింది.రాజ్యసభలో బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

105వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని కేంద్రం వివరించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version