Medigadda project: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇలా నాలుగు అంశాల్లో చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందన్నారు. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది. పిల్లర్లు కుంగిపోవడానికి ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రీట్ కూడా తొలగిపోయిందని కమిటీ తేల్చింది. బ్యారేజ్‌ను పునరుద్దరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది.అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా మేడిగడ్డ తరహాలోనే నిర్మించారని అందువల్ల వెంటనే వాటిని కూడా తనిఖీ చేయాలని సూచించింది. ప్రస్తుత పరిస్దితుల్లో మొత్తం బ్యారేజ్ ని తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ బ్యారేజ్ ను నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీ రిపేర్లు కూడా చేస్తుందని పేర్కొంది.