Postal Ballot Votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు పై సీఈసీ కీలక నిర్ణయం

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై  ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే .

  • Written By:
  • Publish Date - May 31, 2024 / 05:25 PM IST

 Postal Ballot Votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై  ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే . దేశమంతా ఒక రూలు ఆంధ్రప్రదేశ్ లో ఒక రూలా అంటూ వైసీపీ మంది పడింది .దింతో సీఈఓ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేసిన వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. వైసీపీ తరుపు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేసారు .

సీల్,సంతకం లేకున్నా..( Postal Ballot Votes)

ఇలాంటి కీలక నిర్ణయాలపై కేంద్ర ఎన్నికల సంఘం మాత్రమే నిర్ణయం తీసుకోవాలని సీఈఓ కు అధికారం లేదని పిటిషనర్ వాదన .ఈ క్రమంలో దీనికి సంబంధించి సీఈఓ కు అధికారాలు వుంటాయని , సీల్, సంతకం లేకపోయినా ఓటు చెల్లుతుందని హైకోర్టులో మెమో దాఖలు చేసారు సీఈఓ. ఈ నేపథ్యంలో పోస్టల్ ఓట్ల చెల్లింపు అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది .సీల్,సంతకం లేకున్నా ఓట్లు చెల్లుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది .

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో హైకోర్టులో తాము వేసిన మెమో ను విత్ డ్రా చేసుకున్నారు సీఈఓ. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై మరో పిటిషన్ దాఖలు చేస్తామని వైసీపీ తరుపు న్యాయవాది చెబుతున్నారు . దీనిపై న్యాయస్థానం అంతగా ఆసక్తి వ్యక్తం చేయలేదని తెలుస్తోంది . సమయం ఉంటే వాదనలు వింటాం అంటూ న్యాయస్థానం
పేర్కొంది .