Site icon Prime9

CM Jagan’s Foreign Tour: సీఎం జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం.

CM Jagan (tou

CM Jagan (tou

CM Jagan’s Foreign Tour: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే . ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.

సీబీఐ కౌంటర్ దాఖలు..(CM Jagan’s Foreign Tour)

దీనిపై గురువారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్థుల కేసులో విచారణ జరుగుతోందని.. అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. గతంలో కూడా విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతించిందని జగన్ తరుపున న్యాయవాదులు ఈ సందర్భంగా కోర్టుకు గుర్తుచేశారు . ఇరు వాదనలు విన్న సీబీఐ కోర్ట్ న్యాయమూర్తి టి.రఘురాం ఈ కేసులో తీర్పును ఈ నెల 14 కు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ 13వ తేదీన ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు . అది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది .

జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన బెయిల్‌ షరతుల్లో సీబీఐ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న నిషేధం ఉంది. దీనితో జగన్ ఎప్పుడు విదేశాలు వెళ్లాలన్నా సీబీఐ కోర్ట్ అనుమతి తీసుకోవాల్సిందే . కుటుంబ పర్యటన నిమిత్తం యూరప్ దేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే . గురువారం సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.

Exit mobile version