MLA Rachamallu Sivaraprasad Reddy: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివరప్రసాద్ రెడ్డి పై కేసు నమోదు

లీస్ స్టేషన్ లో విచారణలో వున్నఅనుచరులను విడిపించుకుని వెళ్లిన సంఘటనలో ఇప్పటికే టీడీపీకి చెందిన దెందులూరు మాజీ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే .ఈ సంఘటన మరువకముందే ఇలాంటి సంఘటన మరొకటి ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది

  • Written By:
  • Publish Date - May 20, 2024 / 03:18 PM IST

MLA Rachamallu Sivaraprasad Reddy:పోలీస్ స్టేషన్ లో విచారణలో వున్నఅనుచరులను విడిపించుకుని వెళ్లిన సంఘటనలో ఇప్పటికే టీడీపీకి చెందిన దెందులూరు మాజీ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే .ఈ సంఘటన మరువకముందే ఇలాంటి సంఘటన మరొకటి ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది .పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాటు ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఓట్ల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ రోజు ఏ విధమైన దుర్ఘటనలు జరగకుండా వుండే విధంగా ప్రొద్దుటూరు పోలీసులు ట్రబుల్‌ మాంగర్స్‌కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు .

పోలీస్ విధులకు ఆటంకం..(MLA Rachamallu Sivaraprasad Reddy)

ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్త నవీన్‌కుమార్‌రెడ్డిని.. పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిపించారు. తమ అనుచరుడినే స్టేషన్‌కు పిలిపిస్తారా అంటూ నవీన్‌ కోసం ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది మునిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సీఐ శ్రీకాంత్‌ను బెదిరించారు. కౌన్సిలింగ్ జరుగుతుండగా నవీన్‌ను స్టేషన్‌ నుంచి తమతో తీసుకెళ్లిపోయారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్నసిఐ ఫిర్యాదుతో ఎమ్మెల్యే, ఆయన బావమరిదిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలు రోజు ,తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబందించి ఏపీ వ్యాప్తంగా పోలీసులు అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .ఈ క్రమంలో తమ కార్యకర్తలను నేతలు బలవంతంగా విడిపించుకు పోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది .