Akbaruddin Owaisi: విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ని బెదిరించినందుకుగానూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని మంగళవారం రాత్రి సంతోష్ నగర్ పిఎస్ పరిధిలోని మొయిన్ బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించారు. అయితే రాత్రి 10 గంటలకి కావస్తుండటంతో విధుల్లో ఉన్న సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ శివచంద్ర ప్రచార గడువు ముగిసిందని అక్బరుద్దీన్‌కి చెప్పేందుకు స్టేజిపైకి వెళ్ళారు.
సీఐ కు వార్నింగ్ ..(Akbaruddin Owaisi)
దీనితో ఇన్‌స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ మండిపడ్డారు. తనని ఆపే మొనగాడు ఇంకా పుట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక్క సైగ చేస్తే ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. స్టేజి దిగి వెళ్ళాలంటూ సీఐ పైకి ఆగ్రహంగా వెళ్ళారు.నేను కత్తులు మరియు బుల్లెట్ల దాడికి గురయితే బలహీనంగా మారానని అనుకుంటున్నావా? నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయి ఐదు నిమిషాలు ఆగితే నన్ను ఎవరూ ఆపలేరు అంటూ హెచ్చరించారు. దీంతో ఇన్‌స్పెక్టర్ శివచంద్ర స్టేజి దిగి వెళ్ళారు. తన విధులకు ఆటంకం కలిగించారని ఆ తరువాత సీఐ ఫిర్యాదు చేశారు. దీంతో అక్బరుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలో పేరుగాంచిన అక్బరుద్దీన్ ఒవైసీ 1999 నుంచి చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చాంద్రాయణగుట్ట హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్బరుద్దీన్ ఒవైసీ అన్నయ్య అసదుద్దీన్ ఒవైసీకి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ తన సోదరుడిని సమర్దించారు. అక్బరుద్దీన్ ర్యాలీలో మాట్లాడకుండా ఎందుకు అడిగారనే దానిపై విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇచ్చామని తెలిపారు. కానీ అనుమతించిన సమయానికి ఐదు నిమిషాల ముందు పోలీసులు వేదికపైకి ఎక్కి సమావేశాన్ని ఆపమని అడిగారు. అక్బరుద్దీన్ ను తన ర్యాలీని ఆపమని ఎందుకు అడిగారో ఈ సంఘటనపై విచారణ చేయాలని మేము ఎన్నికల కమీషన్ ను డిమాండ్ చేస్తున్నామని అసదుద్దీన్ పేర్కొన్నారు.