Site icon Prime9

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

Mallareddy

Mallareddy

Malla Reddy:మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని 33, 34, 35 సర్వ్ నెంబర్ లోగల 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.

అర్దరాత్రి రిజిస్ట్రేషన్..(Malla Reddy)

షామీర్‌పేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని  కేశవరం గ్రామంలోని సర్వే నంబర్‌ 33, 34, 35లోని లంబాడీల వారసత్వ భూమి 47 ఎకరాల 18 గుంటలను మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని 9 మంది బినామీ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారు. దీనిపై బాధితులు షామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో
ఎస్సీ, ఎస్టీ, సెక్షన్ 420 కింద మల్లారెడ్డి, అతని అనుచరులపై కేసులు నమోదు చేశారు. మంత్రి చామకూర మల్లారెడ్డి అని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం ఎఫ్.ఐ.ఆర్ లో మల్లారెడ్డి అని చేర్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహశిల్దార్ పై కూడా కేసు నమోదు చెయ్యాలని బాధితులు డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు | Ex Minister Malla Reddy Land Scams | Prime9 News

Exit mobile version
Skip to toolbar