Book My Show: నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సైబరాబాద్ పరిధిలో సన్‌బర్న్ పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షో, సన్‌బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈ తరహా ఈవెంట్లకి అనుమతులు లేవని సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. కచ్చితంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈవెంట్ కు అనుమతి లేదు..( Book My Show)
అయితే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు. పేర్కొన్నారు. మరోవైపు ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని సిపి మహంతి వెల్లడించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని అవినాశ్ మహంతి స్పష్టం చేశారు.