CM KCR: ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు..(CM KCR)
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలవనీయమని కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. నాలుగు పైసలుంటే అంత అహంకారం అవసరమా అని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని చెప్పారు.బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్ ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు, పార్టీల మధ్య పోరాటం అని అన్నారు. మోదీ ప్రభుత్వం అంతా ప్రైవేటీకరణ అంటోంది. ఖమ్మం ప్రజలు ఏపీ, తెలంగాణ రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలి.డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు వచ్చిందంటే ఆంద్ర.ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అటువంటి ధరణి ఉండాలా? వద్దా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి, రైతుబంధు, కరెంట్ రెండూ ఉండవన్నారు.
సత్తుపల్లిలో 70వేల మెజార్టీతో సండ్ర గెలుస్తారని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేసారు.ఎవరో చెప్పారని ఓటు వేయడం కరెక్ట్ కాదు.సొంత విచక్షణతో ఓటు వేయాలి.కేసీఆర్ రాకముందు దళితబంధు అనేది ఉందా?దళితులు అణిచివేత, వివక్షకు గురయ్యారు.దళితులను ఓటు బ్యాంకులా వాడుకున్నారు.దళితుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ తప్ప ఎవరూ ఆలోచించలేదు.ఆరునూరైనా తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు కేసీఆర్ అన్నారు.