BRS MLC Tatamadhu: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గాంధీ సిస్టమ్ కాదని.. బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాడికి, జెండా మోసిన వాడికే ఏ స్కీమ్ అయినా దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా ఆయన ఉన్నతాధికారులను వాడు, వీడు అంటూ సంబోధించడం గమనార్హం.
ఎవడయినా సరే ..(BRS MLC Tatamadhu)
భద్రాచలం కేకే ప్యాలెస్ లో జరిగిన సమావేశంలో తాతా మధు మాట్లాడుతూ ఎమ్మార్వో, ఆర్డీఓ , కలెక్టర్ ఎవడయినా సరే వాడు బీఆర్ఎస్ మాట వినాల్సిందే.. ఎందుకంటే ప్రభుత్వం బీఆర్ఎస్‌ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐ అయినా, సీఐ అయినా, ఏసీపీ అయినా, చివరకు కమిషనర్ అయినా బీఆర్ఎస్ మాట వినాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయవలసిందే అని తాతా మధు అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది ఆగష్టు నెలలో వరదల ప్రభావం నష్టనివారణ చర్యలపై మాట్లాడుతున్నపుడు కూడా తాతా మధు ఇటువంటి కామెంట్లే చేసారు. తమ లాంటి ఆధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉండటం వలనే గోదావరి వరదల కారణంగా నష్టం వాటిల్లలేదని అన్నారు. గోదావరికి 50 ఫీట్లకు పైగా వరద వచ్చినా కూడా ఆస్తినష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.