Brother killed sister:సరదా కోసం తీసిన రీల్స్ యువతి ప్రాణాలకు ముప్పును తెచ్చింది. అర్థమయ్యేలా చెప్పాల్సిన అన్న ఆగ్రహంతో చెల్లిని హత్య చేసి కటకటాల్లోకి వెళ్లాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సోదరి మరో యువకుడితో కలిసి యూట్యూబ్ రీల్స్ చేస్తుందని ఆగ్రహంతో ఆమెతో వాదన పెట్టుకున్నాడు.
రోకలిబండతో తలపై కొట్టడంతో..(Brother killed sister)
. సిఎస్‌పి బస్తి పంచాయితీ రాజీవ్ నగర్ కు చెందిన అజ్మీర సంఘవి సోషల్ మీడియాలో యూట్యూబ్ రీల్స్ చేస్తుందని సోదరుడు హరిలాల్ ఆమెతో ఘర్షణ పడ్డాడు. ఆ గొడవ మితిమీరి రోకలిబండతో తలపై కొట్టడంతో అక్కడే కుప్పకూలింది. తీవ్ర గాయాలతో ఉన్న సంఘవిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు హరిలాల్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు.