Boy died in Dogs Attack: హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు పీక్కు తిన్న సంఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. సాత్విక్ అనే బాలుడిని అతి దారుణంగా కుక్కలు కొరికి చంపాయి. మియాపూర్ లోని మక్త మహబూబ్ పేట్ గవర్నమెంట్ స్కూల్ వెనకాల ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఈ ఘటన జరిగింది. బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి.
నిన్నరాత్రి నుంచి కనపడని బాలుడు.. ( Boy died in Dogs Attack)
మియాపూర్ లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన బాలుడు సాత్విక్.. ఆడుకుంటూ వెళ్లి నిన్న రాత్రి నుంచి బాలుడు సాత్విక్ కనబడకుండా పోయాడు. ఈరోజు మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యం అయింది. స్థానికుల సమాచారంతో మియాపూర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన కాట్లను పోలీసులు గుర్తించారు. డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.