Site icon Prime9

MP Raghuramakrishnam Raju: బొత్స ను తక్షణమే సీఎం గా డిక్లేర్ చేయాలి.. ఎంపీ రఘురామకృష్ణం రాజు

Botsa

Botsa

MP Raghuramakrishnam Raju: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆలోచించ వచ్చునన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కాపు నేతల వాదన విడ్డూరంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. మీ పార్టీ కి మాత్రం రెడ్డి సీఎం ఉండవచ్చు కానీ రెండు పార్టీ లు కలిసి పోటీ చేయాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ను సీఎం గా ప్రకటించాలని కోరడం ఇదెక్కడి వింత వాదన అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించ డానికే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సమావేశం కావడం చూస్తే, సూర్యుడు మీద ఉమ్మేస్తే, ఆ ఉమ్ము తమ మీదనే పడుతుందని గ్రహించాలని సూచించారు.జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, కాపు నాయకులలో సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాపులకు జగన్మోహన్ రెడ్డి ఎంతో చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు చెబుతున్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే కాపులకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. 10 శాతం ఓబిసి రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు ఆయన కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా జగన్ మోహన్ రెడ్డి తొక్కి పెట్టి కాపులకు అన్యాయం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ది దారులైన కాపులను ప్రత్యేకంగా చూపెడుతూ, కాపులకు ఆర్ధికంగా మేలు చేశామని చెప్పడం విడ్డురంగా ఉందని విమర్శించారు. బీసీలలో అన్ని కులాలకు పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, వాటికి నిధులను ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు.

అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని నరసాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. రైతులతో అగ్రిమెంట్లు చేసుకుని, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అప్పుల పాలయ్యాను… రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను… వాళ్లకు వీళ్లకు డబ్బులు పంచాను… రాజధాని నిర్మాణానికి నా దగ్గర డబ్బులు లేవని చెబితే కుదరదని అన్నారు. రాజధాని గా అమరావతిని కొనసాగిస్తామని చెబితేనే అన్ని ప్రాంతాల ప్రజలు ఓట్లు వేశారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన, మూడు రాజధానుల మ్యాండెట్ పై ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు విశాఖపట్నం రాజధానిగా కోరడం సహేతుకమా? కాదా?? అన్నది పక్కన పెడితే, కామన్ సెన్స్ తో మాట్లాడుతున్నారని అన్నారు. రాయలసీమ ప్రజలతో మాత్రం రాజధాని వద్దు హైకోర్టు మాత్రమే కావాలని డ్రామా కంపెనీ నడిపిస్తున్నారని విమర్శించారు. సరైన ట్రైనింగ్ ఇవ్వకుండా రోడ్డుమీదికి వదిలారని… వారు రాజధాని వద్దు, కోర్టు మాత్రమే కావాలని అమాయకులతో అనిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు కావలసింది ప్రాంతీయతత్వం కాదన్న రఘురామకృష్ణంరాజు, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆ చలిమంటలలో వేడిని కాచుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు

Exit mobile version