Site icon Prime9

Telangana BCs: తెలంగాణలో బీసీలకు ’లక్ష‘ కష్టాలు

BCS

BCS

Telangana BCs: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల లోన్‌కు అప్లై చేసుకునేందుకు బీసీలు తిప్పలు పడుతున్నారు. క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తహశీల్దార్ ఆఫీసులు, మీ సేవా సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్టిఫికెట్ల జారీకి సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఆర్థిక సాయానికి అప్లై చేసుకునేందుకు ఇవాళే చివరి రోజు కావడంతో బీసీలు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆగ్రహించిన పలువురు.. నిరసనకు దిగారు.

క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లకు పడిగాపులు..(Telangana BCs:)

బీసీ కులవృత్తుల వాళ్లకు లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అప్లికేషన్లలో క్యాస్ట్, ఇన్‌కం, రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. దీంతో అర్హులందరూ సర్టిఫికెట్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు తహశీల్దార్ ఆఫీసుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. వచ్చిన అప్లికేషన్లపై గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేయాల్సి ఉండగా వీఆర్వోలు లేకపోవడంతో ఈ ప్రాసెస్ జరగడం లేదు. వీఆర్ఏలు ఉన్నా.. వాళ్లను తహశీల్దార్లు ఆఫీస్ పనులకు వాడుకుంటున్నారు. దీంతో గ్రామాలకు వెళ్లి ఎంక్వైరీ చేసి సర్టిఫికెట్లు జారీ చేసే సరికి ఆలస్యమవుతోంది. మరోవైపు టెక్నికల్ ప్రాబ్లమ్స్‌తో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు.

క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతుండడంతో ఆగ్రహించిన బీసీలు ఆందోళనలకు దిగారు. తహశీల్దార్ ఆఫీసుల ముందు ధర్నా, రాస్తారోకో చేశారు. తమకు త్వరగా క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Exit mobile version