CM KCR’s Letter: పార్లమెంట్ సమావేశాల్లో బీసీ, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టాలి.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

: ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండు చేసింది.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 06:49 PM IST

CM KCR’s Letter: ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండు చేసింది. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా రిజర్వేషన్ల పై లేఖ రాశారు.2014లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినట్లు లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

పురుషునితో సమానంగా రాణించినపుడే..(CM KCR’s Letter)

సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ఈ అంశంపై కెసిఆర్ పార్టీ ఎంపిలతో చర్చించారు.మహిళల్లో దాగివున్న శక్తిని వెలికితీసి వారికి సహకరిస్తూ వారిని అభివృధ్ధిలో భాగస్వాములను చేసినపుడు మాత్రమే ఏ సమాజమైనా కూడా ప్రగతి పథంలో పయనిస్తుందని కెసిఆర్ అన్నారు. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచవ్యాప్తంగా వున్న సోదాహరణలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం విశ్లేషించింది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ దేశానికే ఆధర్శంగా నిలిచిందని సమావేశం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో…మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు..బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ తన లేఖలో ప్రధానిని కోరారు.