Site icon Prime9

Narayanaswamy Royal: బలిజ సోదరులు వివాహ పరిచయ వేదికలను ఉపయోగించుకోవాలి.. కాపునాడు అధ్యక్షులు నారాయణస్వామి రాయల్

Balija

Balija

Narayanaswamy Royal: బలిజ సోదర సోదరీమణులు తమ పిల్లల కోసం సంఘం అధ్యర్యంలో నిర్వహించే వివాహ  పరిచయ వేదికలను ఉపయోగించుకోవాలని  కాపునాడు అధ్యక్షులు మరియు శ్రీకృష్ణదేవరాయల ఆల్ ఇండియా అధ్యక్షులు నారాయణస్వామి రాయల్ సూచించారు.

రాయలసీమ బలిజ ఉచిత వివాహ పరిచయ వేదికకు ముఖ్య అతిధిలుగా వచ్చిన ఆయన ఇలాంటి పరిచయ వేదికలు మరెన్నో జరపాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రమించిన కొనిదెల శేఖర్ రాయలు, సుబ్బు రాయుడు, వేణు, కొండయ్య, మరియు చిన్నపరెడ్డి తదితరులను ఆయన అభినందించారు. బలిజ సోదరులు ఐక్యంగా ఉండి ఇలాంటి వేదికల ద్వారా తమ పిల్లలు, బంధువుల వివాహసంబంధాలు కుదుర్చుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా నారాయణ స్వామి రాయల్, అమరప్ప. శ్రీనివాసులు, కార్పోరేటర్ బండి బాబులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరికీ భోజన వసతి కల్పించిన ముగ్గురాళ్ల అమరప్పను ప్రముఖులందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఇడుపులపాయ నుండి రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి మహేష్ , జిల్లా కార్యదర్శి పోతిరెడ్డి జయచంద్రుడు, ఆకులవీధి సత్య, ఉద్యోగుల అధ్యక్షులు కోవూరు మస్తాన్ రాయల్‌, చిలమకూరు గంగయ్య, కాపునాడు మాస పత్రిక విలేఖరి శ్రీనివాసులు, జిల్లా యూత్ కార్యదర్శి అనుగోలు సురేష్ ,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మహేష్, పలువురు బలిజ సంఘం నాయకులు హాజరయ్యారు.

Exit mobile version