BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణ ఈ నెల 24 కు వాయిదా

మ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది .ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే .దీనిపై శుక్రవారం విచారణ జరగాల్సి వుంది . అయితే వాదనలకు మరింత సమయం కావాలని ఈడీ కోరడంతో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు .

  • Written By:
  • Publish Date - May 10, 2024 / 04:47 PM IST

BRS MLC Kavitha:ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24కు వాయిదా పడింది .ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే .దీనిపై శుక్రవారం విచారణ జరగాల్సి వుంది . అయితే వాదనలకు మరింత సమయం కావాలని ఈడీ కోరడంతో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు . బెయిల్‌ అంశంపై ఆరోజు సమగ్ర విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కి ఢిల్లీ కోర్టు జడ్జ్ స్వర్ణకాంత శర్మ నోటీసులు జారీచేశారు .

ట్రయల్‌ కోర్టులో చుక్కెదురు..(BRS MLC Kavitha)

ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు తనపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపిస్తూ కవిత రౌస్‌ ఎవెన్యూ కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లో బెయిల్‌ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు నిరాకరించింది. కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సీబీఐ కేసులో కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.