Badiga Jaya: అమెరికాలో తెలుగు తేజం మెరిసింది . కాలిపోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022 నుంచి కోర్టు కమిషనర్ గా పనిచే స్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొం దారు. ఈ రంగంలో ఎందరికో మార్గదర్శకురాలి. గానూ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించిన బాడిగ జయ హైదరాబాదులో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. 1991-1994 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్సు సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. బోస్టన్ విశ్వవిద్యా లయంలో ఉన్నత విద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలోనూ ఈమె పనిచేశారు.
రాజకీయ నేపథ్యంఉన్న కుటుంబం..(Badiga Jaya)
బాడిగ జయ కృష్ణా జిల్లా లోని ప్రముఖ వ్యాపార ,రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ .తండ్రి బాడిగ రామకృష్ణ 2004 నుంచి 2009 వరుకు కాంగ్రెస్ పార్టీ తరుపున మచిలీ పట్నం లోక్ సభ సభ్యుడిగా కొనసాగారు . తాత బాడిగ దుర్గారావు బెంజి కంపెనీ కి డీలర్ .బ్రిటిష్ కాలంలోనే అతి పెద్ద కార్ల కంపెనీకి డీలర్ గా ఉండేవారు . ఇప్పటికి విజయవాడలో వీరి కుటుంబ వ్యాపార కేంద్రం వున్న ప్రాంతానికి బెంజ్ సర్కిల్ గా వ్యవహరిస్తారు .